Header Banner

పాక్ తో యుద్ధం పై విజయశాంతి సంచలన ట్వీట్! ఫాన్స్ ఫైర్..

  Sat May 10, 2025 15:22        Others

పహల్గామ్‌‌లో ఉగ్రవాదుల దాడి తర్వాత ఇండియా , పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆపరేషన్ సింధూర్‌ పేరిట పాకిస్థాన్‌‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది భారత్ ఆర్మీ. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు పాకిస్థాన్ భారత్‌లోని సామాన్యులపై కాల్పులకు దిగింది.

 

భారత్ సైన్యం పాక్ దాడులను తిప్పికొడుతుంది. ఆపరేషన్ సింధూర్‌ సక్సెస్ కావడంపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు. భారత సైన్యం చూపించిన తెగువకు అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.తాజాగా దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ ట్వీట్ చేశారు.అయితే ఆమె తన ట్వీట్‌లో రాజకీయ ప్రస్తావన చేయడమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 

ఇది కూడా చదవండి: వారికి ప్రతి నెలా రూ. 5000.. ఇంటి వద్దకే..! పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం!

 

"భారత్‌పైకి ఉగ్రవాదులని ఉసిగొలుపుతున్న పాకిస్తాన్‌ని కట్టడి చెయ్యడంలో మొదటి నుంచీ ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేననడంలో ఏమీ సందేహం లేదు. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినప్పుడు పాక్ నడిబొడ్డు వరకూ మన సైన్యాన్ని నడిపించి వణుకు పుట్టించింది ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే... ఆ తర్వాత 1971లో తూర్పు పాకిస్తాన్‌ని విడగొట్టి నేటి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారే... వీరిని స్ఫూర్తిగా తీసుకుని తర్వాతి భారత ప్రభుత్వాలు కూడా నేటికీ భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తూనే ఉండి తీరుతారు అన్నది ఎప్పటికీ సత్యం.. అయితే కొంతమంది సోషల్ మీడియాల రాజకీయ ప్రయోజనం కోసం ఈ సమస్యను ప్రస్తావిస్తున్నప్పటికీ, ప్రజలెవ్వరమూ రాజకీయo అనే కోణంలో ఈ అంశాన్ని చూడటం లేదు అని ఆ కొందరు కూడా అర్థం చేసుకోగలగాలని అభిప్రాయపడుతున్నాను.హరహర మహాదేవ్..జై హింద్ ..జై జవాన్" అంటూ ఆమె తన ట్వీట్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు.

 

అయితే దేశ భద్రతకు సంబంధించి యుద్ధం జరుగుతున్న సమయంలో విజయశాంతి ఇలా చేయడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు ఇలాంటి ట్వీట్లు అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తుంటే, ఆ ట్వీట్ డిలీట్ చేయమని మరికొందరు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మరి తనపై వస్తోన్న విమర్శలపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

ఇది కూడా చదవండి: కేంద్రం కీలక నిర్ణయం! అప్పటివరకు ఇక విమానాలు రద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VictoryShanti #WarWithPakistan #SensationalTweet #FansReact #PakistanConflict #BreakingNews